ధనుష్ కెప్టెన్ మిల్లర్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

Captain Miller Making Video Glimpse Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Captain Miller,Captain Miller Movie,Captain Miller Telugu Movie,Dhanush,Captain Miller Movie Updates,Captain Miller Telugu Movie Latest News,Captain Miller Movie Making Video,Captain Miller Telugu Movie Making Video,Dhanush Captain Miller Movie Making Video

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తెలుగులో తను నటించిన సార్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇక తమిళ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ధనుష్. అందులో కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా ఒకటి. ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. తమిళనాడులోని కుర్తాళంలో ఒక గ్రామాన్ని ఈ సినిమా షూటింగ్ కోసం నిర్మించారు. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం చేసిన ఇళ్లు, తుపాకీలు, బాంబుల తయారీని.. షూటింగ్ ప్రారంభించిన విధానాన్ని ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. చివరిలో తుపాకీ పట్టుకుని అటువైపు తిరిగి ఉన్న ధనుష్‌ను చూపించారు.

కాగా ఈసినిమా 1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాకా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =