కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు ప్రభాస్ అభినందనలు

Prabhas Congratulates RRR Movie Team, RRR Movie Team, RRR Movie Creates New Record, Rajamouli Movie, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Shriya Saran, RRR, RRR 202

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు ప్రభాస్ అభినందనలు

Prabhas Congratulates RRR Movie Team

Prabhas Congratulates RRR Movie Team, RRR Movie Team, RRR Movie Creates New Record, Rajamouli Movie, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Shriya Saran, RRR, RRR 202

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి బెస్ట్ పిక్చర్ అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి నుండి మంచి ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ను అభినందించారు. ఇంతటి ఘనత సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి అలానే దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, చరణ్, సంగీత దర్శకడు ఎమ్ ఎమ్ కీరవాణి కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తూ ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్