5 రోజుల్లో అద్భుత కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న లవ్ టుడే
Love Today Movie 5 Days Collections

AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 10 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ తాజాగా 70కో ట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
లవ్ టుడే మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవ్ టుడే మూవీప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తెలుగు లో కూడా ఈ చిత్రం సూపర్ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది.విశేష ప్రేక్షకాదరణ పొందిన లవ్ టుడే మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో లవ్ టుడే మూవీ 5 రోజుల్లో 7.4 కోట్ల నెట్ వసూళ్లతో వీక్ డేస్ లో కూడా అదరగొడుతూ దూసుకెళ్తుంది.








