చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి టీజర్ వరకూ అన్నీ ఆకట్టుకున్నాయి. దానికితోడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఒకే ఆఫీస్ లో పని చేసే హీరో, హీరోయిన్స్, వారి మధ్య ప్రేమ, ఈగోలు, రొమాన్స్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Romantic-Fun Entertainer #UrvasivoRakshasivo is Censored with 𝐔/𝐀 💕
4 Days to go… Grand Release Worldwide on 𝐍𝐨𝐯𝐞𝐦𝐛𝐞𝐫 𝟒𝐭𝐡!
Trailer ▶️ https://t.co/VXKq7iH1ls @AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/jTKnCNNIv0
— GA2 Pictures (@GA2Official) October 31, 2022
కాగా ఈసినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీరజ్ మోగిలినేని సహా నిర్మాతలు. ఇక ఈసినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా అల్లు శిరీష్ కుఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: