ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ వెర్షన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
RRR Japan version special poster revealed

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన "ఆర్ ఆర్ ఆర్" మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఘన విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ వర్షన్ అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా అక్కడ ఫేమస్ గేమ్ డిజైనర్ కొజిమ హిడియా డిజైన్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.







