సూపర్ స్టార్ బర్త్ డే.. సుధీర్ బాబు సర్ ప్రైజింగ్ గ్లింప్స్..!

Sudheer Babus New Movie Glimpse Out On Superstar Krishna Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sudheer Babu,Hero Sudheer Babu,Sudheer Babu Movie Updates,Sudheer Babu Upcoming Movies,Sudheer Babu Movie Glimpse,Sudheer Babu New Movie Glimpse Released,Sudheer Babu Upcoming Movie Glimpse Out Now, Sudheer Babu New Movie Glimpse Out,Sudheer Babu Movie Glimpse Out on Krishna Birthday,Sudheer Babu New Glimpse out on Krishna Birthday,Super Star Krishna Birthday,Krishna Birthday

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రయోగాలు చేయడానికి కొంతమంది మాత్రమే ముందుకు వస్తుంటారు. అలా ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. అందులో ఒకటే మామా మశ్చీంద్ర. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుండగా నేడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్బంగా మామ మశ్చీంద్ర టీమ్ ఆయనకు బర్త్ డే విషెస్ అందిస్తూ సుధీర్ బాబు కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో మరోసారి సుధీర్ బాబు తన సిక్స్ ప్యాక్ ను చూపించాడు. అంతేకాదు తనలోని జిమ్నాస్ట్ ని సూపర్ స్టైలిష్ గా చూపించారు. మొత్తానికి సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సుధీర్ బాబు ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ అందిందని చెప్పొచ్చు.

కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు నార్త్ ఆడియన్స్ ను సుపరిచితుడే. టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించాడు. దీంతో ఈసినిమాను అక్కడ కూడా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =