అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఈసినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున అలానే మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా మూడు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో మొదటి భాగమైన బ్రహ్మాస్త్ర-శివ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హిందీలో ఏ రకంగా అయితే ప్రమోషన్స్ చేస్తారో అలానే సౌత్ లో కూడా అదే రేంజ్ లో చేయాలని చూస్తున్నారు. అందులోనూ సౌత్ బాధ్యతలు మొత్తం జక్కన్న రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే. మరి రాజమౌళి ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడెక్కడ ఎప్పుడు.. ఎలా చేయాలి అనిపక్కాప్లానింగ్ తో ఉంటాడు. ఇప్పటికే వైజాగ్ లో ప్రమోషన్ ప్లాన్ కూడా వేశారు. మరోవైపు ఈసినిమా నుండి ఇప్పటికే పలు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా రీసెంట్ గానే పాటలు కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే హిందీలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కేసరి పాటను తెలుగులో కుంకుమలా అంటూ వచ్చే ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 15వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
In just 100 days, BRAHMĀSTRA: Part One will be all yours 💥
But before that, don’t miss the #Brahmastra TRAILER on JUNE 15TH!! 💥💥
Trailer Announcement (Hindi) : https://t.co/s7KKfUDnrg pic.twitter.com/KYVkFwUdFS
— Dharma Productions (@DharmaMovies) May 31, 2022
కాగా మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























