‘అంటే సుందరానికి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Ante Sundaraniki Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Telugu Movie Trailer,Ante Sundaraniki Official Trailer, Ante Sundaraniki Trailer Release Date Fixed,Ante Sundaraniki Movie Trailer,Ante Sundaraniki Movie Trailer Release date Confirmed,Natural Star Nani Ante Sundaraniki Movie Trailer Release Date Fixed, Nani Ante Sundaraniki Movie latest Traielr Updates,Nani New Movie Ante Sundaraniki Trailer Release Date Updates

ప్రస్తుతం వస్తున్న క్రేజీ కాంబినేషన్ లో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ యాక్ట్రెస్ నజ్రియాది కూడా ఒకటి. నాని, నజ్రియా కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే సుందరానికి.వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో సీరియస్ అండ్ కంపోజ్డ్ గా కనిపించిన నాని.. ఈసినిమాలో మరోసారి తన కామెడీ యాంగిల్ ను బయటకు తీశాడు. దానికి తోడు నజ్రియా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన నటన. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. రెండు రోజులు క్రితం ఈ సినిమా ట్రైలర్ అప్ డేట్ ను నేడు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టు నేడు ట్రైలర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. జూన్ 2న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

కాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. న‌జ్రియా తెలుగులో న‌టిస్తున్న మొద‌టి చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టిస్తుండగా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా కనిపించనుంది. ఇంకా ఈసినిమాలో న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌. మరి నాని కామెడీ ఎంటర్ టైనర్ లంటే మినిమమ్ గ్యారెంటీ అన్న సంగతి తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తోనే సినిమాను సగం సక్సెస్ చేసేస్తాడు. మరి ఈసినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =