‘సలార్’ టీజర్ పై క్లారిటీ..!

Here Is a Clarity on Salaar Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,Salaar Teaser,Salaar Movie Teaser,Salaar Telugu Movie Teaser,Prabhas,Prabhas Salaar Teaser,Latest Updates On Salaar Teaser,New Update on Salaar Movie Teaser,Live Updates On Prabhas Salaar Teaser

ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సలార్ సినిమా కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. రీసెంట్ గా తన డైరెక్షన్ లో వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇక దానికి తోడు ఈసినిమా కె.జి.యఫ్ ను రెండింతలు సలార్ ఉంటుందని ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న భువనగౌడ చెప్పడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ గురించి గత కొద్దిరోజులుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా టీజర్ మే నెలలో ఉంటుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ కూడా టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సలార్ నిర్మాత మే నెలలో సలార్ టీజర్ ని రిలీజ్ చెయ్యడం లేదని ప్రస్తుతం కి వాయిదా వేస్తున్నామని అలాగే ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. మరి ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశ పరిచే వార్తే అని చెప్పొచ్చు. మరి టీజర్ అప్ డేట్ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు ఈసినిమాకు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =