‘ఎన్టీఆర్ 30’ క్రేజీ అప్ డేట్..!

NTR30 Crazy Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie Updates,Jr NTR upcoming Movie Updates,Jr NTR Latest News,Jr NTR #NTR30 Movie Updates,Jr NTR Next Project, Koratala Siva and Jr NTR Movie Shooting Updates,Jr NTR Next Movie with Koratala Siva,Jr NTR #NTR30 Movie with Koratala Siva,Koratala Siva Next Movie with Jr NTR, #NTR30 All Set to Start Shooting,Jr NTR 30th Movie with Koratala Siva

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చింది. దాదాపు నాలుగేళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాకే టైమిచ్చాడు ఎన్టీఆర్. ఈసినిమా మొదలైనప్పుడు తొందరగానే పూర్తిచేద్దామనుకున్నా మధ్యలో కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి నాలుగేళ్లు అయిపోయింది. ఇక రాజమౌళితో సినిమా అంటే మధ్యలో వేరే సినిమాలు కూడా కమిట్ అవ్వలేరన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తన 30వ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా లేట్ అయిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు అలానే ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్రయూనిట్ ఒక వీడియో రిలీజ్ చేయగా ఈ వీడియోలో సముద్రం, పడవలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ రెండు చేతుల్లో రెండు ఆయుధాలు ఉన్నాయి. దీన్నిబట్టి కొరటాల మరో ఫుల్ యాక్షన్ సినిమాతో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇంకా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. మరి జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఇప్పటినుండే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దానికి తోడు ఈసినిమా మరో లెవల్లో ఉంటుందని ఇప్పటికే చెప్పాడు కొరటాల శివ. చూద్దాం మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =