‘క్రేజీ ఫెలో’.. క్రేజీ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

Date and Time fixed for Crazy Fellow First Look Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Crazy Fellow,Crazy Fellow Movie,Crazy Fellow Telugu Movie,Crazy Fellow Movie Updates,Crazy Fellow First Look Updates,Crazy Fellow Date and Time Fixed, Crazy Fellow Movie Date and Time Fixed,Crazy Fellow Telugu Movie First Look Date and Time Fixed,Aadi Saikumar Crazy Fellow Movie First Look Date and Time Fixed, Aadi Saikumar Crazy Fellow Movie First Look Release Date Fixed,Aadi Sai Kumar Mvie Udpates,Aadi Saikumar Latest Movie Udpates

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఇప్పుడు అందరూ ఒకటి కంటే ఎక్కువ సినిమాలనే చేస్తున్నారు. కొంతమంది లిస్ట్ లో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఆది సాయికుమార్ కూడా ఒకరున్నారు. ఆది కూడా సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆది లిస్ట్ లో అయితే రిలీజ్ కావాల్సిన సినిమాలే రెండు మూడు ఉన్నాయి.. షూటింగ్ దశలో కూడా నాలుగైదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు ఆది సాయికుమార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఫణికృష్ణ సిరి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఈసినిమా టైటిల్ ను ఈమధ్యనే రిలీజ్ చేశారు మేకర్స్. క్రేజీ ఫెలో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ లుక్ కు టైమ్ ఫిక్స్ చేశారు. ఈసినిమా నుండి క్రేజీ లుక్ ను మే 19వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది సాయికుమార్ సరసన దిగాంగన సూర్యవన్షీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవ సంగీతం అందిస్తున్నాడు. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =