శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “F3 ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 24 గంటల్లో 12.5 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా, 260K కి పైగా లైక్స్ రావడం విశేషం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో “F3 ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: