‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.. ఫస్ట్ వీకెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్..!

Vishwak Sen AVAK Movie USA Latest Collections,Ashoka Vanamlo Arjuna Kalyanam Collections:1st Weekend,US,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam Latest Movie Updates, Ashoka Vanamlo Arjuna Kalyanam Collections,Ashoka Vanamlo Arjuna Kalyanam Collections Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam 1st Collections,Ashoka Vanamlo Arjuna Kalyanam Box Office Collections, Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie 1st Day Collections,Ashoka Vanamlo Arjuna Kalyanam 1st Weekend Collections in US

విద్యాసాగర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకూ విశ్వక్ సేన్ మాస్ పాత్రల్లోనే ఎక్కువగా అలరించాడు. అయితే మొదటిసారి కాస్త డిఫరెంట్ గా చేశాడు. ఇక ఈసినిమా మే 6న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకొని నీట్ అండ్ కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అందుకుంది. విశ్వక్ సేన్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఏజ్ పెరుగుతున్నా కూడా పెళ్లి కానీ వ్యక్తి గా కూల్ అండ్ సెటిల్డ్ పాత్రల్లో నటించి మెప్పించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఓవర్సీస్ లో కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టినట్టు తెలుపుతుంది చిత్రయూనిట్. ఓవర్సీస్ లో ఈసినిమా 85 లొకేషన్స్ లో రిలీజ్ చేయగా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈసినిమా 100కే డాలర్స్ ను సొంతం చేసుకుంది. అయితే నెంబర్ చిన్నదయినా కూడా అంత తక్కువ స్క్రీన్లలో ఈసినిమా అంత కలెక్షన్స్ ను రాబట్టడం అనేది విశేషమనే అంటున్నారు.

కాగా ఈసినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మించారు. జయ ఫణి సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + thirteen =