
ట్యాగ్ · 4 కథనాలు


"సలార్ " మూవీ లో విలన్ గా సాయిచంద్?

'సలార్' లో నేను లేనంటున్న 'ఖిలాడి' భామ..!

హీరో ప్రభాస్ కు శృతి హాసన్ థ్యాంక్స్

'సలార్'.. మోస్ట్ వయోలెంట్ గా ప్రభాస్..!
రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు అభిమానులు సలార్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.ఇక ప్రశాంత్ నీల్ రీసెంట్ గా కె.జి.యఫ్ 2 తో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు ‘సలార్’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతేడాదే ఈసినిమా సెట్స్ పైకి వెళ్ళి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక మధ్యలో కరోనా వల్ల, ఆదిపురుష్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ మే ఫస్ట్ వీక్ నుండి తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

"సలార్ " మూవీ లో విలన్ గా సాయిచంద్?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

'సలార్' లో నేను లేనంటున్న 'ఖిలాడి' భామ..!
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ల సందడి ఎక్కువైంది. ఇప్పటి వరకూ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన సమంత, కాజల్, రకుల్ తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న, పూజా హెగ్డే తమ హవా కొనసాగిస్తుండగా వారితో పాటు కొత్త హీరోయిన్స్ కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో మీనాక్షి చౌదరి కూడా ఉంది. ప్రస్తుతం ఈ భామ ఖిలాడి సినిమాలో రవితేజ సరసన ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది…

హీరో ప్రభాస్ కు శృతి హాసన్ థ్యాంక్స్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.