అఫీషియల్.. చిరు సినిమాలో డాషింగ్ డైరెక్టర్ ‘పూరీ జగన్నాథ్’

Puri Jagannadh Onboard as actor for Chiranjeevi’s GodFather,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Puri Jagannadh,Ace Director Puri Jagannadh,Director Puri Jagannadh,Puri Jagannadh Turns Actor in Chiranjeevi Movie Godfather,Puri Jagannadh in Chiranjeevi Movie Godfather, Puri Jagannadh Godfather Movie Updates,Puri Jagannadh Movie Updates,Director Puri Jagannadh upcoming Movies,Chiranjeevi Godfather Movie Updates,Chiranjeevi latest Movie Updates, Chiranjeevi about Puri Jagannadh,Puri Jagannadh in Chiranjeevi Film Godfather,Godfather Latest Shoot updates,Chiranjeevi Godfather Telugu Movie

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకున్నాడు సల్లూభాయ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో టాప్ డైరెక్టర్ కూడా నటిస్తున్నాడు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన జనగణమన సినిమా లాంచింగ్ వేడుకలో చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నాడన్న విషయం చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కరోజు ఈ విషయంపై వార్తలు వచ్చినా ఆ తరువాత మరిచిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఆ వార్త కన్ఫామ్ అయిపోయింది. చిరు గాడ్ ఫాదర్ లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిరు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే నా సినిమాలో స్పెషల్ రోల్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటూ తెలిపాడు.

కాగా ఈసినిమాలో నయనతార మరో కీలక పాత్రలో నటిస్తుంది. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =