
ట్యాగ్ · 2 కథనాలు

మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క

అనుష్క శెట్టి- నవీన్ పొలిశెట్టి సినిమా షూటింగ్ అప్ డేట్..!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. . సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క
నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టిలింగ్వల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.