కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"రాధేశ్యామ్" ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్

Radhe shyam release trailer press meet,Radhe Shyam Is A National Film,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Justin Prabhakaran,UV Creations,Radhe Shyam Trailer,Radhe Shyam Mo

"రాధేశ్యామ్" ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్

Radhe shyam release trailer press meet

Radhe shyam release trailer press meet,Radhe Shyam Is A National Film,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Justin Prabhakaran,UV Creations,Radhe Shyam Trailer,Radhe Shyam Mo

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

"రాధేశ్యామ్ " మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ముంబై లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ పూజాహెగ్డే , దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో ప్రభాస్ మాట్లాడుతూ .. ఒక ప్రాంతీయ సినిమా గా ఆగిపోకుండా ఇండియన్ ఆడియన్స్ కు చేరువ అవ్వాలనే ఆశయం తో కృషిచేస్తున్నామనీ , పాన్ ఇండియా ట్రెండ్ "బాహుబలి " మూవీ తో ప్రారంభం అయ్యిందనీ , "కె జి ఎఫ్ ", "పుష్ప" వంటి మూవీస్ ను ఇండియన్ ఆడియన్స్ ఆదరించారనీ , "RRR", "రాధేశ్యామ్ " వంటి పాన్ ఇండియా మూవీస్ తోపాటు మరో 50 పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ ఆడియెన్స్ ను అలరించనున్నాయనీ , భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్ద చిత్ర పరిశ్రమ గా అవతరించనుందనీ చెప్పారు. పూజాహెగ్డే మాట్లాడుతూ .. 70 లలో ఇటలీ లో జరిగిన ప్రేమకథ గా తెరకెక్కిన ఈ మూవీ లో ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటించానని , ఈ మూవీ లో భాగం కావడం ఆనందంగా ఉందనీ చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్