కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

విశాల్ 'సామాన్యుడు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Vishal Samanyudu Movie Release Date Locked,Saamanyudu Releasing On January 14th 2022,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Telugu Movie 2021,Saamanyudu New Movie,Vishal,Hero

విశాల్ 'సామాన్యుడు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Vishal Samanyudu Movie Release Date Locked

Vishal Samanyudu Movie Release Date Locked,Saamanyudu Releasing On January 14th 2022,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Telugu Movie 2021,Saamanyudu New Movie,Vishal,Hero

రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

నిజానికి ఈసినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అంతేకాదు జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సామాన్యుడు ని కూడా సంక్రాంతి రేసులో దించాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఈ మేరకు జనవరి 14 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు.

కాగా ఈసినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్‌ రాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్