మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు . అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. “ఆర్‌ఆర్‌ఆర్” చిత్రబృందం చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఉక్రె యిన్‌కు వెళ్ళి ఒక సాంగ్ ను చిత్రీకరించారు. ఆ సాంగ్ తో ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ , ప్రమోషనల్ కార్యక్రమాలకు 2 నెలలు మాత్రమే సమయం ఉంది
నెక్స్ట్ వీక్ జరిగే ప్రెస్ మీట్ లో “రౌద్రం రణం రుధిరం” మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: