
ట్యాగ్ · 4 కథనాలు


పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్

"18 పేజెస్ " మూవీ రిలీజ్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల…

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ
యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2" , "18 పేజెస్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .