
ట్యాగ్ · 6 కథనాలు


పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్

"18 పేజెస్ " మూవీ రిలీజ్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల…

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ
యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజీస్. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రను సృష్టించాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి రీసెంట్ గానే ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న '18 పేజీస్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా గత ఏడాదే మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేక పోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలుసు. అయితే ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఈలోపు ఇతర పనులను కానిచ్చేస్తున్నారు.