ట్యాగ్ · 2 కథనాలు
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
అప్పుడు 'రైడ్' కి కలిసొచ్చింది - ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' కి
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమా ట్రయిలర్ ను కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సాయి శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి కామెడీపై కూడా ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మంచి కామెడీ యాంగిల్ ను కూడా బయటపెట్టాడు.
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ "మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.