కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Check Film

ట్యాగ్ · 8 కథనాలు

సినిమా వార్తలు

ఆ అవకాశం వస్తే నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే

చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా చెక్. ఇక ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 26)న రీలీజ్ కానుంది. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో అంచనాలను పెంచగా ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో.. లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న నితిన్‌ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. అవేంటో మీరు కూడా ఒక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే 'చెక్' సినిమా వెంటనే ఓకే చేశా

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అంత విజయం కాకపోయినా ప్రియా మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో చెక్ లాంటి మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తుంది. ఇది ప్రియా ప్రకాష్ కు డైరెక్ట్ తెలుగు ఫిలిం. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియా ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాణ సంస్థకు 'చెక్' నైజాం హక్కులు

చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడన్న అభిప్రాయానికి వస్తున్నారు అందరూ . ఇక ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా పడింది. టీజర్ కు ట్రైలర్ కు మంచి టాక్ వచ్చి సినిమాపై అంచనాలు పెరిగితే ఆ సినిమా హక్కులు కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోతాయన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు చెక్ విషయంలో కూడా అదే జరిగింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి రంగ్ దే కాగా.. మరొకటి చెక్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'చెక్'. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నితిన్ చెక్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇక చంద్రశేఖర్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' - ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్

ఈ ఏడాది హీరో నితిన్‌ హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘రంగ్‌ దే’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'చెక్' మొదలైంది

సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ ‌రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా... ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'చెక్' రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా న‌టిస్తార‌ని టాక్. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్