
ట్యాగ్ · 2 కథనాలు

బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్

అల్లు అర్జున్-అట్లీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
'పుష్ప 2' చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ.1900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రంలో నటించనున్నారు. మైథలాజికల్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పురాణం పురుషుడు కుమారస్వామి పాత్రను పోషించనున్నారని సమాచారం.
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.