ట్యాగ్ · 6 కథనాలు
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
అల్లు అర్జున్ పై దిశా పటాని ప్రశంసలు

అల్లు అర్జున్ 20... కేరళలో 40 రోజుల భారీ షెడ్యూల్

మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా అల్లు అర్జున్
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని... త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
అల్లు అర్జున్ పై దిశా పటాని ప్రశంసలు
కరోనా వైరస్ నివారణ కై ప్రధాని మోదీ 21రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంతమంది సెలబ్రిటీస్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది వర్క్ అవుట్స్, కుకింగ్, గేమ్స్, రీడింగ్, టీవీ చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు.

అల్లు అర్జున్ 20... కేరళలో 40 రోజుల భారీ షెడ్యూల్
`అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక వైపు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరో వైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న బన్నీ ?
‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అలా వైకుంఠపురములో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం... టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తదుపరి చిత్రాలు చేయనున్నాడు బన్నీ. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. కాగా... ఒకవైపు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరోవైపు ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌ను, ఓ బైలింగ్వల్ మూవీనికూడా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ నేపథ్యంలో... పాన్ ఇండియా ఫిలిం కోసం బన్నీ ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్తలు…

మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. 10 నెలల గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వరుస సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ -అల్లు అర్జున్, సుకుమార్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ మూవీ కావడం విశేషం.