సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన 'ఇస్మార్ట్ భామ'...?
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్ర మరింత పేరును సంపాదించి పెట్టడమే కాదు ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. నభా ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", అల్లుడు అదుర్స్" మూవీస్ లో నటిస్తుంది. ఇంకా నితిన్ హీరోగా వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో కూడా నభా ను తీసుకోనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వింటూనే వున్నాం.