ట్యాగ్ · 3 కథనాలు
అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!
"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?
బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!
హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సాలిడ్ పాత్రలతో దూసుకుపోతుంది శివగామి అదే రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.
అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్ నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.
"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.