
ట్యాగ్ · 5 కథనాలు

లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?
బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!
అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!
"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?

'రిపబ్లిక్' - రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్
దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. భారతదేశం స్వా తం త్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకు అంటూ ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా తీస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రీసెంట్ గానే సాయి తేజ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 5న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే…
లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?
తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు మూవీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. "పడయప్పా "తమిళ మూవీ లో రజనీకాంత్ కు ధీటుగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రమ్యకృష్ణ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!
హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సాలిడ్ పాత్రలతో దూసుకుపోతుంది శివగామి అదే రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.
అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్ నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.
"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.