
ట్యాగ్ · 4 కథనాలు


మహేష్,రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా..!

రెండేళ్ళ బాకీ తీరుస్తున్న యన్టీఆర్

యువ ముఖ్యమంత్రి పాత్రలో యంగ్ టైగర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వంత ప్రొడక్షన్ హౌస్ ?
"యంగ్ టైగర్" అంటూ ప్రేక్షక, అభిమానులచే ముద్దుగా పిలిపించుకునే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "RRR" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు.

మహేష్,రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా..!
టాలీవుడ్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతలుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ సొంత ప్రొడక్షన్స్ నే పెట్టుకోవడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జిఏంబి ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య ఇలా చాలా మంది హీరోలు అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు.

రెండేళ్ళ బాకీ తీరుస్తున్న యన్టీఆర్
కథానాయకుడిగా తొలి అడుగేసిన సంవత్సరంలోనే ముచ్చటగా మూడు సినిమాలు చేసి మురిపించిన వైనం యంగ్ టైగర్ యన్టీఆర్ సొంతం. ఆపై ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకునేవాడు ఈ యాక్టింగ్ పవర్ హౌస్. అయితే, తొలిసారిగా 2009ని `జీరో రిలీజ్ ఇయర్`గా సరిపెట్టాడు తారక్. ఆ తరువాత మళ్ళీ గ్యాప్ తీసుకోని ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో.. కుదిరితే సంవత్సరానికి రెండు సినిమాలు లేదంటే కనీసం ఒక చిత్రమైనా చేస్తూ మురిపిస్తూ వచ్చాడు.

యువ ముఖ్యమంత్రి పాత్రలో యంగ్ టైగర్?
ఒకవైపు మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉంటూనే... మరోవైపు కొత్త చిత్రానికి సన్నద్ధమవుతున్నాడు యంగ్ టైగర్ యన్టీఆర్. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు తారక్. అంతేకాదు.. `అయినను పోయిరావాలె హస్తినకు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ భారీ బడ్జెట్ మూవీ... పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అలాగే.. ఇందులో యువ ముఖ్యమంత్రిగా యన్టీఆర్ కనిపిస్తాడని కథనాలు వస్తున్నాయి.