
ట్యాగ్ · 3 కథనాలు


#Prabhas 20 షూటింగ్ షెడ్యూల్ పై దర్శకుడి వివరణ
ప్రభాస్ 20.. రిలీజ్ డేట్ ఫిక్స్?

'ప్రభాస్ 20' సినిమా ప్రారంభం గ్లిoప్స్ మీకోసం..!
ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

#Prabhas 20 షూటింగ్ షెడ్యూల్ పై దర్శకుడి వివరణ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న #Prabhas20 మూవీ జార్జియా లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాలేదని, షూటింగ్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కు దర్శకుడు రాధాకృష్ణ చెక్ పెట్టారు.
ప్రభాస్ 20.. రిలీజ్ డేట్ ఫిక్స్?
`బాహుబలి` చిత్రాలతో కథానాయకుడిగా ఆకాశమంత ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు `డార్లింగ్` ప్రభాస్. ఆ ఇమేజ్ తగ్గట్టుగానే సినిమాలు చేసుకుపోతున్న ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో... ప్రస్తుతం తన 20వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థలు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ... శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.