ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
'వకీల్ సాబ్' లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి..!
హిందీలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా పింక్. స్త్రీ స్వేచ్చ, హక్కులపై న్యాయ వ్యవస్థపై ముగ్గురు యువతులు ఎలా పోరాటం చేశారు..వారికి అమితాబ్ ఎలా సాయం అన్నది ఈ సినిమా కథాంశం. ఇక హిందీలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తమిళ్ లో కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారనుకోండి. తెలుగులో కూడా ఎదో మెసేజ్ ఇచ్చాం అన్నట్టుగా కాకుండా కమర్షియల్ అంశాలు జోడించనున్నారు. అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోకుండా.. మరి ఎక్కువ హీరోయిజం చూపించకుండా... తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కథలో భాగంగానే హీరోని చూపించాలని ప్లాన్ చేస్తున్నారు.