
ట్యాగ్ · 4 కథనాలు


సెన్సార్ పూర్తిచేసుకున్న 'హిట్'
అంచనాలు పెంచుతున్న'HIT' స్నీక్ పీక్ వీడియో

'HIT' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

హిందీ 'హిట్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
మన తెలుగు సినిమాలకు ఇప్పుడు నార్త్ లో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ హిట్ అయిన చాలా సినిమాలు ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయి రిలీజ్ కూడా అయ్యాయి. ఇక ఈనేపథ్యంలో తెలుగు హిట్ అయి హిందీ లో రీమేక్ అవుతున్న మరో సినిమా హిట్ మూవీ. శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'హిట్'. ఈసినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హిట్'
ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో కలిసి నాని హిట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇక ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రయిలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
అంచనాలు పెంచుతున్న'HIT' స్నీక్ పీక్ వీడియో
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రోజుకో అప్ డేట్ తో బజ్ క్రియేట్ చేస్తున్నారు 'హిట్' చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్,ట్రైలర్ ప్రేక్షకులకి మంచి థ్రిల్ కలిగించాయి. తాజాగా నాలుగున్నర నిమిషాల స్నీక్ పీక్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది. హత్య చేసి పొదల్లో పాతిపెట్టిన మహిళ మృత దేహాన్ని విశ్వక్ సేన్ చాలా చాకచక్యంగా కనిపెడతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది.

'HIT' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు
శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఒకపక్క ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెంచాయి.