ఒకే రోజు సూర్య‌, విజ‌య్ చిత్రాలు

Suriya - Vijay New Movies Set To Hit Theatres On The Same Day

ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కావ‌డం అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే త‌మిళ‌నాట… ఏప్రిల్ 9న మ‌రోమారు పున‌రావృతం కానుంది. ఆ రోజు కోలీవుడ్ స్టార్స్ విజ‌య్, సూర్య కొత్త చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే… విజ‌య్ `మాస్ట‌ర్`, సూర్య `సూర‌రై పోట్రు`. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏప్రిల్ 9నే విడుద‌ల కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే.. విజ‌య్ గ‌త చిత్రం `విజిల్` విడుద‌ల రోజునే.. సూర్య త‌మ్ముడు కార్తి న‌టించిన `ఖైదీ` కూడా రిలీజ‌య్యింది. ఇప్పుడేమో విజ‌య్ కొత్త సినిమా `మాస్ట‌ర్` వ‌చ్చే రోజునే సూర్య న్యూ మూవీ `సూర‌రై పోట్రు` రాబోతోంది. మొత్తానికి విజ‌య్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్ నుండి గ‌ట్టిపోటీనే ఎదురైంద‌నుకోవాలి.

మ‌రి… కార్తితో విజ‌య్ పోటీప‌డ్డ సంద‌ర్భంలో ఇద్ద‌రూ విజ‌యాలు చూశారు. ఇక సూర్యతో పోటీప‌డుతున్న ఈ సంద‌ర్భంలోనూ అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =