‘డర్టీ హరి’ నుండి ట్రెడిషనల్ లుక్

Dirty Hari Movie Traditional Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Dirty Hari Movie Updates,Dirty Hari Telugu Movie Latest News,Dirty Hari Movie Live Updates,Dirty Hari Movie New Details

దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా ‘డర్టీ హరి’ అనే సినిమాతో వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రెండు రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ ఆసక్తి రేపింది. తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారని అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు తాజాగా మరో లుక్ ను రిలీజ్ చేశారు. ఎవరిదో కాదు ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న రుహని శర్మ లుక్ ను రివీల్ చేశారు.గోల్డ్ కలర్ శారీ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ కు సంబంధం లేకుండా టోటల్ గా డిఫరెంట్ గా వుంది. మరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో డర్టీ హరి చిత్ర యూనిట్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు శ్రవణ్ రెడ్డి. పరిచ గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయ‌డం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =