ట్యాగ్ · 5 కథనాలు
`అరణ్ మణై` ఫ్రాంచైజీలో రాశీఖన్నా
రాశీఖన్నా.. హ్యాట్రిక్ కొడుతుందా?
ఒకే నెలలో రెండు సూపర్ హిట్ మూవీస్
'వరల్డ్ ఫేమస్ లవర్' లో నా లిమిట్స్ క్రాస్ చేశా..!
ఒక హీరోయిన్ కు బోల్డ్ సన్నివేశాల్లో నటించాలంటే ఎంత కష్టమో నటించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. మొదటి నుండి ఆ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కు అయితే అది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ పద్దతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది హీరోయిన్స్ వుంటారు.. మొదటినుండి కాస్త గ్లామర్ రోల్స్ కు తక్కువగా.. బోల్డ్ సన్నివేశాలకు దూరంగా. అలాంటి హీరోయిన్స్ కు మాత్రం ఇది కష్టమే అని చెప్పొచ్చు. అలా ఇన్ని రోజులు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న రాశీ ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అలాంటి సన్నివేశాల్లో నటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ సన్నివేశాల్లో నటించడంపై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది.
`అరణ్ మణై` ఫ్రాంచైజీలో రాశీఖన్నా
`వెంకీమామ`, `ప్రతి రోజూ పండగే`... ఇలా తెలుగునాట వరుస విజయాలతో దూసుకుపోతోంది రాశీఖన్నా. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ `వరల్డ్ ఫేమస్ లవర్`తో కలసి పలకరించబోతోంది. ఇదిలా ఉంటే... తమిళంలోనూ కథానాయికగా తనదైన ముద్ర వేసిన రాశి.. తాజాగా ఓ హారర్ కామెడీ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
రాశీఖన్నా.. హ్యాట్రిక్ కొడుతుందా?
`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రాశీఖన్నా. ఫిల్మ్ మేకర్ హారికగా `వెంకి మామ`లోనూ, టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణాగా `ప్రతి రోజూ పండగే`లోనూ అటు అందం, ఇటు అభినయంతో అలరించిన రాశి.. త్వరలో `వరల్డ్ ఫేమస్ లవర్`తో కలసి పలకరించబోతోంది.
ఒకే నెలలో రెండు సూపర్ హిట్ మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ "ఊహలు గుస గుస లాడే " తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన అందాల రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్ , జై లవకుశ , రాజా ది గ్రేట్ , తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ "ఇమైక్క నోడిగళ్ " మూవీ లో నటించి అక్కడ రాశీ ఖన్నా బిజీగా మారారు.
మరో పాట పాడిన రాశీఖన్నా
రాశీఖన్నా... మంచి నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. `జోరు`, `విలన్`(మలయాళం)... ఇలా తను నటించిన సినిమాలకే కాదు... `బాలకృష్ణుడు`, `జవాన్` వంటి తను నటించని సినిమాలకు కూడా పాటలు పాడింది రాశి. కట్ చేస్తే... రెండేళ్ళ తరువాత రాశి మళ్ళీ గాత్రం సవరించుకుంది. తను నాయికగా నటించిన `ప్రతి రోజూ పండగే` కోసం ఓ హుషారైన పాట పాడిందట ఈ టాలెంటెడ్ బ్యూటీ. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట రాశికి గాయనిగా మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్. త్వరలోనే ఈ గీతాన్ని మేకింగ్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తారని వినికిడి.