
ట్యాగ్ · 5 కథనాలు


'విక్రమ్' కు కరోనా పాజిటివ్..!
తండ్రీ కొడుకులు హీరోలుగా #VIKRAM 60 మూవీ

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్

కమల్ హాసన్ విక్రమ్ సీక్వెల్ లో విక్రమ్?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమాతో చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది.

'విక్రమ్' కు కరోనా పాజిటివ్..!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమలో మళ్లీ పెరుగుతుంది. ఈమధ్య కరోనా ప్రభావం లేదు అని అనుకుంటుండగా మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విక్రమ్. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్ ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. మరోవైపు కమల్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన…

విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా" #VIKRAM60 " తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
తండ్రీ కొడుకులు హీరోలుగా #VIKRAM 60 మూవీ
ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం "కోబ్రా ", "మహావీర్ కర్ణ ", "పొన్నియిన్ సెల్వన్ " మూవీస్ లోన్ నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ ఇప్పుడు తన 60 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ మూవీ రూపొందనుంది.

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్
విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ పెద్దగా ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్