
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు


'RX 100'తో ఆరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమా తరవాత 'గుణ369', 'హిప్పీ' లాంటి భారీ సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన 90 ఎంఎల్ కు కాస్త పాజిటివ్ టాకే వచ్చింది. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీ గా వున్నాడు కార్తికేయ.
బ్లాక్ బస్టర్ "RX 100 "మూవీ లో హీరోగా నటించి యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ నటించిన "హిప్పీ ", "గుణ 369 " మూవీస్ నిరాశ పరిచాయి. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన 90ML మూవీ నిన్న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన పొందింది. మూవీస్ ఫలితాలు ఎలా ఉన్నా కార్తికేయ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.