ట్యాగ్ · 2 కథనాలు

మదర్ సెంటిమెంట్ తో `ఫైటర్`?
ఫైటర్ తో బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

మదర్ సెంటిమెంట్ తో `ఫైటర్`?
`అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`... `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. బాక్సింగ్ నేపథ్యానికి మదర్ సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా... అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే... బాక్సింగ్, మదర్ సెంటిమెంట్ తోనే మరో చిత్రాన్ని రూపొందించబోతున్నాడు పూరి. ఆ సినిమానే... `ఫైటర్`.