కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thoota Movie Censor Report

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తూటా'

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ 'ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట'. తెలుగులో ఈ సినిమాను 'తూటా' టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు. సినిమా కూడా ఎప్పుడో పూర్తయింది కాని రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇప్పటికి రెండు మూడుసార్లు విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఈ రోజు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కానీ అది కూడా జరగలేదు. డిసెంబర్ లో మరో మంచి డేట్ కోసం చూస్తున్నారట చిత్ర బృందం.

TFN Adminవాట్సాప్

షేర్