
ట్యాగ్ · 4 కథనాలు

మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్

అప్పుడే మొదలైన మహేష్ మేనియా - భారీ కటౌట్ ఏర్పాటు..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా 'సరిలేరు నీకెవ్వరు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.
నిన్ను చూస్తే గర్వం గా ఉంది సితు పాపా - మహేష్ బాబు
క్రిస్ బక్ , జెన్నిఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నా ప్రధాన పాత్రలలో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన 3డి కంప్యూటర్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్2మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లోని రాకుమారి ఎల్సా పాత్రకు హిందీ లో ప్రియాంక చోప్రా, తెలుగు లో నిత్యా మీనన్, తమిళం లో శృతి హాసన్ డబ్బింగ్ చెప్పడం విశేషం.
మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ నవంబర్ 7వ తేదీ తో 65 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. కలత్తూర్ కన్నమ్మ తమిళ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన కమల్ హాసన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో 60 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకొన్నారు. కమల్ హాసన్ నటించిన అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కమల్ హాసన్ నటుడే కాకుండా నిర్మాత, దర్శకుడు, సింగర్ కూడా. 60 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ అయినా సందర్భంగా అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
సరిలేరు నీకెవ్వరు నుండి మహేష్ పోస్టర్ రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం.