ట్యాగ్ · 3 కథనాలు
'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్
`అసురన్` రీమేక్‌లో వెంకటేష్
వేసవి బరిలో 'అసురన్' రీమేక్?
తమిళనాట కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న `అసురన్` చిత్రం... ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా శ్రియ నటిస్తుందని... అలాగే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా కన్‌ఫర్మ్ అయ్యాడని ప్రచారం సాగుతోంది. కాగా... ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని... ఆపై చకచకా చిత్రీకరణ జరిపి వేసవి కానుకగా మే నెలలో సినిమాని జనం…
'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన 'అసురన్' ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ ఈ రీమేక్ ను చేస్తున్నట్టు టాలీవుడ్ లో ఒకటే వార్తలు చక్కర్లు కొట్టాయి.
`అసురన్` రీమేక్‌లో వెంకటేష్
విక్టరీ వెంకటేష్ పలు రీమేక్ చిత్రాల్లో సందడి చేశారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. కాగా... `గురు`(2017) తరువాత మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకీ. అదే... తమిళ చిత్రం `అసురన్`. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ విలేజ్ డ్రామా తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 4న రిలీజైన ఈ సెన్సేషనల్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేయగా... కలైపులి థాను నిర్మించారు. ఇక తెలుగు వెర్షన్‌ని డి.సురేష్ బాబుతో పాటు మాతృక నిర్మాత కలైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వెంకటేష్…