
ట్యాగ్ · 3 కథనాలు


శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్

టాప్ ప్రొడ్యూసర్ తో శిరీష్ కొత్త సినిమా..!
అల్లు శిరీష్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చిన శిరీష్.. ఇప్పటివరకూ మరొక సినిమాను చేయలేదు. ఇక మధ్యలో కరోనా కూడా రావడంతో దాదాపు అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఇక ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్…

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్
రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.
వచ్చే ఏడాది రెండు సినిమాలు - కుదిరితే వెబ్ సిరీస్ కూడా...!
'గౌరవం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శిరీష్ ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదనే చెప్పొచ్చు. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలు కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇటీవలే మలయాళం హిట్ మూవీ ‘ఏబీసీడీ’ ని రీమేక్ చేయగా అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు శిరీష్ ఎప్పటినుండో.