భారతీయుడు 2 అప్ డేట్ – రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్

Bharateeyudu 2 Regular Shoot to Commence From This Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Bharateeyudu 2 Regular Shoot Date Locked,Bharateeyudu 2 Regular Shoot Date Confirmed,Bharateeyudu 2 Movie Shooting Updates,#Bharateeyudu2,Bharateeyudu 2 Movie Shooting News
Bharateeyudu 2 Regular Shoot to Commence From This Date

గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ సినిమాలో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. అవినీతి, లంచగొండి తనానికి వ్యతిరేకిగా.. కమల్ హాసన్ ముసలివాడి పాత్రలో చేసిన నటన పీక్స్. ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ ఈ సినిమా సీక్వెల్ ను చేయడానికి సిద్దమయ్యారు కమల్ హాసన్, శంకర్. భారతీయుడు 2 గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం.

ఇక సినిమాకోసం శంకర్ ఎప్పటినుండో లొకేషన్స్ కూడా సెర్చ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే చెన్నై .. పొల్లాచ్చి .. యూరప్ లలో ఎక్కువభాగం చిత్రీకరణ జరపనున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి పొల్లాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఆ తరువాత చెన్నై, యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

కాగా ఈసినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేయనున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=wcdrXwZo198]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =