
ట్యాగ్ · 186 కథనాలు · పేజీ 10


వెంకటేష్ `సంక్రాంతి`కి 15 ఏళ్ళు

వెంకటేష్ `మల్లీశ్వరి`కి పదహారేళ్ళు

ఒకే బాటలో వెంకటేష్, రానా

`నారప్ప`లో మరో హీరోయిన్?

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు

కోవిల్ పట్టిలో `నారప్ప`
తమిళనాట ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మాతృకని నిర్మించిన కలైపులి ఎస్. థానుతో కలసి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.

వెంకటేష్ `సంక్రాంతి`కి 15 ఏళ్ళు
కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. ఆయన నటించిన పలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `సంక్రాంతి` ఒకటి. తమిళ చిత్రం ‘ఆనందం’(2001)కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన స్నేహ, ఆర్తి అగర్వాల్ నాయికలుగా నటించారు. శ్రీకాంత్, శివబాలాజి, శర్వానంద్, చంద్రమోహన్, శారద, సంగీత, రతి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. `రాజా` వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత వెంకటేష్, ముప్పలనేని శివ కాంబినేషన్‌లో వచ్చిన `సంక్రాంతి` కూడా అదే బాట పట్టడం విశేషం.

వెంకటేష్ `మల్లీశ్వరి`కి పదహారేళ్ళు
అగ్ర కథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్‌కి కామెడీ టైమింగ్‌లో తిరుగులేదు. అందుకే ఆయన నటించిన పలు కామెడీ ఎంటర్‌టైనర్స్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అటువంటి చిత్రాలలో `మల్లీశ్వరి` ఒకటి. ఇందులో “పెళ్ళి కాని ప్రసాద్” క్యారెక్టర్‌లో వెంకీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముదురు వయసు బ్రహ్మచారిగా వెంకీ ప్రదర్శించిన నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవగా... త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, కె.విజయ భాస్కర్ దర్శకత్వ ప్రతిభ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తెలుగు తెరకు నాయికగా పరిచయమవడమే కాకుండా... టైటిల్…

ఒకే బాటలో వెంకటేష్, రానా
ఈ వేసవి దగ్గుబాటి అభిమానులకు వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా.. తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. `నారప్ప`గా వెంకటేష్ సమ్మర్ లో సందడి చేయనుండగా.. `విరాట పర్వం`తో రానా అదే సీజన్ లో పలకరించనున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు నాలుగు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.

`నారప్ప`లో మరో హీరోయిన్?
తమిళంలో ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. మాతృక నిర్మాత కలైపులి ఎస్. థానుతో కలసి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ధ్రువనక్షత్రం’ ఒకటి. వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.అశోక్ కుమార్ నిర్మించారు. వెంకటేష్ సరసన రజిని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘ఊర్వశి’ శారద, భానుచందర్, రోహిణి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, శివకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.