
ట్యాగ్ · 5 కథనాలు


'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు

ప్రభాస్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కు రెడీ..!
ఆ రీమేక్ ని వదిలేసిన వెంకీ?

బాలీవుడ్ మూవీ లో వెంకటేష్ ?
సూపర్ హిట్ "చిన్న తంబి "తమిళ మూవీ హిందీ రీమేక్ "అనారీ" (1993)మూవీ తో హీరో వెంకటేష్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత వెంకటేష్ హీరోగా సూపర్ హిట్ "యమలీల"తెలుగు మూవీ హిందీ రీమేక్ "తక్ దీర్ వాలా "తెరకెక్కింది. ఆ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. తరువాత హీరో వెంకటేష్ మరే హిందీ మూవీ లోనూ నటించలేదు. 25సంవత్సరాల తరువాత వెంకటేష్ ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లలో తరు ణ్ భాస్కర్ కూడా ఒకడు. మొదటిసినిమా పెళ్లి చూపులు తోనే తన సత్తా చాటాడు. చిన్న సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇదిలా ఉండగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది.
మల్టీస్టారర్స్ తో వెంకీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్
మల్టీస్టారర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` మొదలుకుని `వెంకి మామ` వరకు ఐదు మల్టీస్టారర్స్ లో మెస్మరైజ్ చేశారాయన. వీటిలో `మసాలా` మినహా మిగిలిన చిత్రాలన్నీ మంచి ఫలితాల్నే అందించాయి. అయితే, ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్స్ తో పలకరించడం, వాటితో బ్లాక్ బస్టర్స్ చూడడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. అది 2019లోనే చోటుచేసుకోవడం విశేషం.

ప్రభాస్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కు రెడీ..!
బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ `వెంకీమామ`కి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంకా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.
ఆ రీమేక్ ని వదిలేసిన వెంకీ?
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం `వెంకీమామ`... తన బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` రీమేక్ లో నటించబోతున్నారు ఈ సీనియర్ హీరో. ఇందులో రెండు ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నారు వెంకీ. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్... జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ తరువాత యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబోలో హార్స్ రేస్ క్లబ్ నేపథ్యంలో వెంకీ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తారని టాక్.