ట్యాగ్ · 66 కథనాలు · పేజీ 4
ఆ ఘనత మనవాళ్లదే ..!
బిజీ హీరోయిన్ రీతూవర్మ
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
టాలీవుడ్ లో మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇప్పుడంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. ఇక టాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి. అయితే ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మనకు తెలియని కొన్ని విషయాలు మాత్రం ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం మనం.
ఆ ఘనత మనవాళ్లదే ..!
మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
బిజీ హీరోయిన్ రీతూవర్మ
బ్లాక్ బస్టర్ "బాద్ షా " మూవీ తో నటనకు శ్రీకారం చుట్టిన హైదరాబాద్ అమ్మాయి రీతూవర్మ సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ తో హీరోయిన్ గా మారారు."పెళ్ళిచూపులు " మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "వేల ఇల్ల పట్టాధారి 2 " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రీతూవర్మ "కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాళ్ "(కనులు కనులను దోచాయంటే ) తమిళ మూవీ తో విజయం సాధించి కోలీవుడ్ లో బిజీగా మారారు.
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.
టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా
భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక భాషలో హిట్ అయిన మూవీ ని మరో భాషలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో విజయం సాధించిన మూవీస్ ని హిందీ భాషలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సెన్సేషనల్ హిట్ మూవీ "అర్జునరెడ్డి "హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ "జెర్సీ "మూవీ హిందీ లో రీమేక్ జరుపుకోనుంది. టాలీవుడ్ మూవీస్, దర్శకుల పైన బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. అయితే అప్పుడప్పుడు హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకునేవాళ్ళు. తమ సినిమాలు తాము నిర్మించుకునేవాళ్ళు. కానీ ఆ సంప్రదాయం తక్కువగానే ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఇప్పుడున్న యంగ్ హీరోలు మాత్రం ఒకటి రెండు సినిమాలకే సొంత ప్రొడక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది హీరో లు తమ సినిమాలు తామే నిర్మించుకుంటున్నారు. సినిమా హిట్ అయిందంటే హీరోలకి కాసుల వర్షమే. మరి అలా మన యంగ్ హీరోలు ఎవరు తమ ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారో చూద్దాం.