కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Updates 2026

ట్యాగ్ · 60 కథనాలు

Sai Abhyankar Onboard as Music Director for D 55
సినిమా వార్తలు

D 55 మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని 'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

Mahender Reddyవాట్సాప్
Theatrical Rights Price of Couple Friendly Revealed
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి అంటే ?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదలకు సిద్దమవుతుంది.ఈ ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిపోయింది.తెలుగు రాష్ట్రాలకు గాను ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని దక్కించుకున్నారు. దాదాపు 4.05కోట్లకు ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.సినిమాగా బాగా రావడంతో సంతోష్ శోభన్ మార్కెట్ మించి ఎక్కవ ధర పెట్టి సినిమాను కొనుక్కున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈసినిమాను సరిగమ సినిమాస్ విడుదలచేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
With Love Is a Feel-Good Entertainer Everyone Can Connect With says Rana Daggubati
సినిమా వార్తలు

'విత్ లవ్' అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్: రానా దగ్గుబాటి

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Here’s How Many Watched Mana Shankaravara Prasad Garu in Nizam
సినిమా వార్తలు

మన శంకర వర ప్రసాద్ గారు నైజాంలో ఎంత మంది చూశారంటే ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'చిత్రం నైజాం ఏరియాలో అద్భుతమైన రికార్డును సృష్టించింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించి, సరికొత్త మైలురాళ్లను అధిగమించింది.

Mahender Reddyవాట్సాప్
Funky Second Single Out Tomorrow
సినిమా వార్తలు

ఫంకీ సెకండ్ సింగిల్ రానుంది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'ధీరే ధీరే' శ్రోతలను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Makers Announce Varanasi Release Date
రిలీజ్ అప్‌డేట్

వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Climax Shoot in Progress for Sambarala Yeti Gattu
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ ఓ రేంజ్ లో

సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటిగట్టు'. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

Mahender Reddyవాట్సాప్
First Look of Rasha Thadani from Srinivasa Mangapuram Is Out
ఫస్ట్ లుక్

శ్రీనివాస మంగాపురం నుండి రషా తడానీ ఫస్ట్ లుక్ రిలీజ్

మంగళవారం తరువాత దర్శకుడు అజయ్ భూపతి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా ద్వారా ఈ సినిమాతో సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తోంది.వీరిద్దరి మధ్య సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Om Shanti Shanti Shantihi movie review in telugu
రివ్యూ

రివ్యూ :ఓం శాంతి శాంతి శాంతిః

చివరగా .. 'ఓం శాంతి శాంతి శాంతిః' కేవలం నవ్వించే సినిమా మాత్రమే కాదు, ఆలోచింపజేసే చిత్రం కూడా. భార్యాభర్తల మధ్య గౌరవం ఉండాలని, సమానత్వం ముఖ్యమని చాటిచెప్పే ఈ చిత్రం ప్రతి కుటుంబం తప్పక చూడాల్సిన మూవీ. వారాంతంలో సరదాగా గడపాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్.

Mahender Reddyవాట్సాప్
Prabhas’ Fauji Aims for Dussehra Release
సినిమా వార్తలు

దసరా టార్గెట్ గా ప్రభాస్ ఫౌజీ

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' గురించి మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో చిత్ర యూనిట్ అత్యంత పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.

Mahender Reddyవాట్సాప్
High Court Passes Sensational Orders on the Use of NTR’s Name and Image
సినిమా వార్తలు

ఎన్టీఆర్ పేరు, ఇమేజ్ వాడుకుంటే ఇక చర్యలు తప్పవు: హైకోర్టు సంచలన ఆదేశాలు

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీల పేరు, ఇమేజ్ మరియు గుర్తింపును ఇతరులు వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడమే ఈ తీర్పు ముఖ్య ఉద్దేశం.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravara Prasad Garu latest Overseas Collections
బాక్సాఫీస్

మన శంకర వరప్రసాద్ గారు లేటెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం విదేశాల్లో ఇప్పటివరకు $4.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹41 కోట్లు) మార్కును దాటి దూసుకుపోతోంది.చిరు , అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఈసినిమా హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. అటు అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే $3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Latest Shoot Update from The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ షూట్ అప్డేట్

నేచురల్ నాని , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' . 'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మళ్లీ జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Champion Is Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఛాంపియన్

శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈ రోజు నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడా వీక్షించవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Hey Bhagawan Teaser Promises a Hilarious Ride
ట్రైలర్ & టీజర్

హిలేరియస్ గా హే భగవాన్ టీజర్

'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హే భగవాన్'. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నేడు విడుదలై నవ్వులు పూయిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
RT 77 Title Irumudi Revealed Along with First Look
ఫస్ట్ లుక్

ఆసక్తికరంగా RT 77 టైటిల్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు (జనవరి 26, 2026) మరియు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దక్కింది. రవితేజ తన 77వ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి చిత్రాలను అందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thiruveer’s First Look from Oh Sukumari Is Out Now
ఫస్ట్ లుక్

యాదగిరి గా తిరువీర్.. ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి' చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే దామిని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు తిరు వీర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీలోకి రానున్న అన్నగారు వస్తారు
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అన్నగారు వస్తారు

కోలీవుడ్ హీరో కార్తీ ,యంగ్ హీరోయిన్ కృతి శెట్టి జంటగా నటించిన క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'వా వాతియార్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ కార్తీ నటన ,కామెడీ టైమింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి.అయితే తెలుగు లో ఈసినిమాను అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Felicitate Padma Shri Winners Murali Mohan and Rajendra Prasad
సినిమా వార్తలు

మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు 'పద్మశ్రీ'.. ఘనంగా సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి

రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని సాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Release Date Announced for Shah Rukh Khan’s King
రిలీజ్ అప్‌డేట్

షారుఖ్ ఖాన్ కింగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' (KING)తో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు నేడు (జనవరి 24, 2026) చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 'కింగ్' మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్

షేర్