కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 9

Jaat Theme Song Released
సాంగ్

జాట్ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Birthday NTR, Trivikram Srinivas and Many Celebs Extends Wishes
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌ బర్త్ డే.. ఎన్టీఆర్ సహా సెలబ్రిటీల విషెస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నేడు 43వ జన్మదినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయ‌న‌కు పలువురు సినీ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్‌ని 'బావ' అని సంభోదిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.

Srikanth Mవాట్సాప్
Arjun SO Vyjayanthi Second Single Muchataga Bandhaale Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

అర్జున్ S/O వైజయంతి సెకండ్ సింగిల్ వస్తోంది

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Icon Star Allu Arjun Creates History in Indian Cinema For Journey to Global Stardom
సినిమా వార్తలు

ఒకే ఒక్కడు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్‌.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు. విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Completes All Censor Formalities and Gets UA Certificate
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Confirms AA22 Project With Director Atlee on His Birthday
సినిమా వార్తలు

అల్లు అర్జున్-అట్లీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది

'పుష్ప 2' చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ.1900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రంలో నటించనున్నారు. మైథలాజికల్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పురాణం పురుషుడు కుమారస్వామి పాత్రను పోషించనున్నారని సమాచారం.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan Son Mark Shankar Injured in Fire Mashup
సినిమా వార్తలు

పవన్‌ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్నిప్రమాదంలో గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి ప్రమాదం జరిగింది. సింగపూర్‌లో మార్క్ శంకర్‌ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రమాదం అనంతరం స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్‌‌ను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati To Attend Jack Pre Release Event Today
సినిమా వార్తలు

జాక్ కోసం రానున్న రానా

'డీజే టిల్లు' ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు సరసన 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్‌, ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 10 నిమిషాల రన్ టైం కలిగివుంది.

Mahender Reddyవాట్సాప్
Music Director Thaman Confirms Composing Work Completed For JAAT
సినిమా వార్తలు

పవర్ ఫుల్‌గా జాట్ మ్యూజిక్ - తమన్

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ గతేడాది 'గదర్ 2' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దీనితర్వాత ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జాట్'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Odela 2 is doing massive pre-release business
సినిమా వార్తలు

సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఓదెల 2

తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటించిన సినిమా ఓదెల 2.ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సీక్వెల్ వస్తుంది.ఇక ఈసినిమా టీజర్ తోనే షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్, ఓటిటి రైట్స్ కలిపి 25 కోట్లకు పైగా అమ్ముడయ్యాయట.దాంతో విడుదలకు ముందే బడ్జెట్ రికవరీ అయిపొయింది.ఈసినిమాకు 25కోట్లు ఖర్చు పెట్టారట.సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కవగా ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
Jack completes censor formalities
సినిమా వార్తలు

జాక్ రన్ టైం రివీల్

టిల్లు స్క్వేర్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాతో వస్తున్నాడు.మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు.నాలుగు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.రన్ టైం కూడా తక్కువగానే వుంది.2 గంటల 10 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Global Star Ram Charan's PEDDI First Shot, Knocks It Out of The Park
సినిమా వార్తలు

పెద్ది ఫస్ట్ షాట్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్, రెండు అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్ల తో హ్యుజ్ బజ్ సృష్టించాయి. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
OTT streaming date for Court has been locked
ఓటీటీ

ఓటిటిలోకి రానున్న కోర్ట్

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ నో బడీ.నేచురల్ స్టార్ నాని ఈసినిమా ను నిర్మించగా 50 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసిఅక్కడ కూడా హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు దక్కించుకోగా ఈనెల 11నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నామని అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఆడ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Darsanamey Song Promo Released From Nari Nari Naduma Murari
సాంగ్

నారీ నారీ నడుమ మురారి నుండి 'దర్శనమే' సాంగ్ ప్రోమో రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Dhruva Sarja First Look Poster Released From Seetha Payanam
ఫస్ట్ లుక్

సీతా పయనం నుంచి ధృవ సర్జా ఫస్ట్ లుక్ రిలీజ్

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Peddi glimpse creates an all-time record
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పెద్ది గ్లింప్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.నిన్న టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఈ వీడియో 24 గంటల్లో 36 .5 మిలియన్ల రియల్ టైం వ్యూస్ తో 24గంటల్లో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు దేవర పేరు మీద వుంది.దేవర 24 గంటల్లో 26.14 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి మొదటి స్థానంలో ఉండేది.పెద్ది కేవలం 18 గంటల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Akshaye Khanna Steps into Prasanth Varma Cinematic Universe With MAHAKALI
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ మహాకాళిలో అక్షయ్ ఖన్నా

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU)ను ప్రేక్షకులను పరిచయం చేసిన 'హను-మాన్' పాన్-ఇండియా విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ 'మహాకాళి' PVCUలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

Srikanth Mవాట్సాప్
Akhil6 Title Glimpse to be Unveiled Tomorrow
ట్రైలర్ & టీజర్

అఖిల్ 6 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' చిత్రం వచ్చి రెండేళ్లు అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ తదుపరి చిత్రంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly telugu Trailer is out now
ట్రైలర్ & టీజర్

గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మరో 3 రోజుల్లో విడుదలకానుంది. ఈసినిమాపై తమిళంలో భారీ అంచనాలు వున్నాయి. ఇక రెండు రోజుల క్రితం తమిళ ట్రైలర్ విడుదలకాగా ఈరోజు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది. దాంతో తెలుగులో కూడా ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయిన ఇప్పటికే కావల్సిన బజ్ వచ్చింది.చాలా రోజుల తరువాత అజిత్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Arjun Son of Vyjayanthi Team Released Powerful Poster of Kalyan Ram and Vijayashanthi
ఫస్ట్ లుక్

అర్జున్ S/O వైజయంతి నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

Srikanth Mవాట్సాప్

షేర్