ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 89
షూటింగ్ ఆగలేదు.. 'ఆచార్య' టీం క్లారిటీ
"సర్కస్ "మూవీ సెట్స్ లో పూజాహెగ్డే
శియా గౌతమ్ టాలీవుడ్ రీ ఎంట్రీ

RECAP..ఈవారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్
సినిమా వార్తలు - టాలీవుడ్ వీక్లీ రౌండప్..!
"శ్రీకారం "మూవీ సక్సెస్ మీట్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ మూవీ లో సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
షూటింగ్ ఆగలేదు.. 'ఆచార్య' టీం క్లారిటీ
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే గత కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు. అక్కడ చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను.. ఒక పాటను కూడా చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
'జాతిరత్నాలు' పై బన్నీ ప్రశంసలు - బ్రెయిన్ స్విచ్ఛాఫ్ చేయండి
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా నిన్న శివరాత్రి పండుగ సందర్బంగా రిలీజ్ అవ్వగా అది మంచి టాక్ తో దూసుకుపోతుంది. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకూ నవ్వుకుంటూనే ఉంటారని... మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని ఇప్పటికే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా ఈసినిమా చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.
"సర్కస్ "మూవీ సెట్స్ లో పూజాహెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "రాధేశ్యామ్ ", అఖిల్ అక్కినేని "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ షూటింగ్స్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయిక గా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాలీ", రణ్ వీర్ సింగ్ "సర్కస్ "బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
శియా గౌతమ్ టాలీవుడ్ రీ ఎంట్రీ
పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రవితేజ హీరోగా రూపొందిన "నేనింతే "(2008) మూవీలో సైడ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా మారే క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శియా గౌతమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "వేదం "(2010) తరువాత శియా గౌతమ్ మరే తెలుగు మూవీ లోను నటించలేదు. 11 సంవత్సరాల తరువాత శియా గౌతమ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.

RECAP..ఈవారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పేతురాజ్. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఆమె కూడా పాల్గొందని తెలుస్తుంది.
సినిమా వార్తలు - టాలీవుడ్ వీక్లీ రౌండప్..!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.