కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Film News

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా

భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక భాషలో హిట్ అయిన మూవీ ని మరో భాషలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో విజయం సాధించిన మూవీస్ ని హిందీ భాషలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సెన్సేషనల్ హిట్ మూవీ "అర్జునరెడ్డి "హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ "జెర్సీ "మూవీ హిందీ లో రీమేక్ జరుపుకోనుంది. టాలీవుడ్ మూవీస్, దర్శకుల పైన బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.

Team TFNవాట్సాప్
Dil Raju To Release 6 Movies This Year,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Cinema Updates,Tollywood Film News,Dil Raju Upcoming Movies 2019,Upcoming Movies of Dil Raju Under his Production Banner 2019,Producer Dil Raju Latest News,D
స్పెషల్

ఈ ఏడాదిలోనూ ‘దిల్’ రాజు నుంచి ఆరు చిత్రాలు?

ఈ తరం నిర్మాతలలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ప్రొడ్యూస‌ర్‌ ఎవ‌రంటే... నిస్సంకోచంగా `దిల్‌` రాజు అనే చెప్పాలి. ముఖ్యంగా... 2017లో అయితే ఆరు సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాకుండా వరుస విజయాల‌తో `డ‌బుల్ హ్యాట్రిక్‌` కొట్టి న‌యా రికార్డు సృష్టించారు. అయితే... 2018లో మాత్రం ఆ మ్యాజిక్‌ని కంటిన్యూ చేయలేకపోయారు రాజు. కాగా... తాజాగా సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన `ఎఫ్ 2`తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌... ఈ సంవ‌త్స‌రం కూడా 2017లో త‌ర‌హాలోనే ఆరు చిత్రాల‌తో ప‌ల‌క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda To Team Up With A Tamil Director Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Cinema Updates,Tollywood Film News,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Next Film Updates,He
సినిమా వార్తలు

మ‌రోసారి త‌మిళ ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లతో ముందుకు సాగుతున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రస్తుతం... ఈ యూత్ ఐకాన్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అద‌య్యే లోపే... క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ బ్యానర్‌లో క్రాంతి మాధవ్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించ‌డంతో... విజ‌య్ న‌టించ‌బోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... `నోటా` త‌రువాత మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
Nagarjuna To Repeat His Manmadhudu Sentiment Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Cinema Updates,Tollywood Film News,Manmadhudu Movie Updates,Manmadhudu Telugu Movie Latest News,King Nagarjuna To Repeat His Manmadhudu Sentiment
సినిమా వార్తలు

రెండో ‘మన్మథుడు’కి జోడీగా ఇద్ద‌రు భామ‌లు?

కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. వాటిలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ‘మన్మథుడు’ (2002) ఒకటి. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... టాలీవుడ్ మన్మథుడుగా నాగార్జునకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కాగా... ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ రూపుదిద్దుకోబోతోంది. ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna to Play a Cameo in Samantha Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Cinema Updates,Tollywood Film News,Samantha Upcoming Movie News,Akkineni Samantha Next Film Updates,Nagarjuna Guest Role in Samantha New Movie
సినిమా వార్తలు

స‌మంత చిత్రంలో అతిథిగా నాగ్‌?

కింగ్ నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత వెండి తెరపై కనిపిస్తే అక్కినేని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతారు. ఇప్పటివరకు ఈ మామా కోడళ్లు ‘మనం’, ‘రాజు గారి గది 2’ చిత్రాల్లో క‌లిసి నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. కాగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెరను పంచుకోవడానికి వీరిద్ద‌రూ సిద్ధపడుతున్న‌ట్లు టాలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్